నవంబర్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్?

-

తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్లు సమాచారం అందుతుంది. ఈనెల 7వ తేదీ నుంచి పదవ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్… ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నారు అధికారులు.

Training for constable candidates in November
Training for constable candidates in November

అనంతరం స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్బి వెరిఫికేషన్ ను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లోగా పూర్తిచేసి నవంబర్లో శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల తెలంగాణ స్టేల్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు కానిస్టేబుల్‌ తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసు నియామక మండలి(TSLPRB) అక్టోబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news