రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ఉగ్రవాదులు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ఉగ్రవాదులు విలయం సృష్టించిన విషయం తెలిసిందే.మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు. వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 115కు చేరినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ దాడులకు సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకోగా మరో 11 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్‌కు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. ఈ ఉగ్రదాడి పిరికి పంద చర్యగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అభివర్ణించింది. మరోవైపు క్రాకస్ సిటీ హాల్ దాడిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు.