సౌదీ అరీబియ విద్యా ప్రణాళికలో రామాయణం, మహాభారతం…!

ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సలీమాన్ కొత్త ఎడ్యుకేషన్ విధానం లో సౌదీ అరేబియా లో ఇతర దేశాల చరిత్రని మరియు సంస్కృతిని కూడా ఉండాలని కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇతర సంస్కృతుల్ని విద్యా విధానం లో ఉంచితే జ్ఞానం మరింత పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అయితే దీనిలో భాగంగా అక్కడ విద్యార్థులు కి రామాయణం మరియు మహాభారతం నేర్పిస్తారు అని తెలుస్తోంది. భారతీయ సంస్కృతి నుండి యోగ, ఆయుర్వేదం కూడా విద్యా విధానం లో యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త విద్యా ప్రణాళిక లో రామాయణం మరియు మహాభారతం పరిచయం చేయడం జరుగుతోంది.

సౌదీ అరేబియా విద్యార్థుల విద్యా ప్రణాళికలో దీనితో పాటుగా ఇంగ్లీష్ మీకు కూడా తప్పనిసరిగా చేశారు. విద్యా రంగం లో వచ్చిన మార్పులకు సంబంధించిన అన్ని ఇబ్బందులని తొలగించడానికి, నౌఫ్-అల్-మార్వై అనే ట్విట్టర్ యూజర్ స్క్రీన్ షాట్ పంచుకోవడం ద్వారా ఈ విషయం తెలుస్తోంది. సౌదీ అరేబియా యొక్క కొత్త విధానం-2030 సిలబస్ లో ఉదారంగా మరియు సహనంతో భవిష్యత్తును నిర్మించడంలో ఇవి సహాయపడతాయి అని అతను రాశారు.