ఈ స్కూల్ లో ఆడ, మ‌గ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్కర్ట్ లోనే

-

సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు ఒక్కో రకంగా యూనిఫామ్ ఉంటుంది. చివరకు స్కూల్ కు వచ్చే ఉపాధ్యాయులకు కూడా డ్రెస్ కోడ్ వేరేలా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం బాలురు, బాలికలు చివరకు ఉపాధ్యాయులు కూడా స్కర్టుతో రావాల్సిందే.. ఇంతకి ఆ వింత నిర్ణయం తీసుకున్న స్కూల్ ఎక్కడుందో తెలుసా.. అసలు ఎందుకు ఇలాంటి డ్రెస్ కోడ్ తో రావాలన్నారో తెలుసా…తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

స్కాట్లాండ్ ఎడిన్ బర్గ్ నగరానికి చెందిన ఓ స్కూల్ బాలురు, బాలికలు, ఉపాధ్యాయులు స్కర్టు తోనే రావాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది లింగ అసమానతలను తొలగించడానికే అని తెలిపింది. ఇలా ఒకే డ్రెస్ కోడ్ లో పాఠశాలకు వచ్చి జెండర్ ఈక్వాలిటీని పెంపొందించే లక్ష్యంతో ఇలా చేశామని చెబుతున్నారు. నవంబర్ 4న, ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మొదటిసారిగా “వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్ డే” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. “బట్టలకు లింగభేదం లేదు, మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మేము ఇలా చేశామని స్కూల్ యాజమాన్యం అంటోంది. అయితే ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. 

అయితే ఈ విధానాన్ని పలువురు సమర్థించగా.. మరికొంత మంది విమర్శిస్తున్నారు. ’ఇది అసలు ఏం పని నీ పిచ్చిపనులకు సిగ్గుపడు‘ అని పాఠశాలను ఉద్దేశించి ఓ తండ్రి అన్నాడు. విద్యార్థులకు అకాడమిక్ విద్య అవసరం అని అన్నాడు మరో పేరెంట్. ’అవమానకరమైనది, పిల్లలకు వారి బేసిక్స్ నేర్పండి, ఈ బ్లడీ నాన్సెన్స్‘ అన్నింటినీ ఆపండి.‘ అంటూ మరో పేరెంట్ ఘాటుగా స్పందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news