15 ఏళ్లు పైబడిన అమ్మాయిల, 45 ఏళ్లలోపు వితంతువులు వివరాలడిగిన తాలిబాన్ : రిపోర్ట్

ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ తో పోరాడుతున్న తాలిబన్ అక్కడ ఉన్న స్థానిక మతపెద్దలకు 15 ఏళ్ళు పైబడిన బాలికల వివరాలు మరియు 40 ఏళ్ల లోపు ఉన్న వితంతువులు వివరాల్ని అడిగారు. వాళ్లు చేసిన ఒక ప్రకటన ద్వారా ఈ విషయం తెలుస్తోంది. అయితే వీళ్ళు ఈ వివరాలు సేకరించి తాలిబన్ వాళ్ళ యొక్క ఫైటర్ల తో వివాహం జరిపించాలని అనుకుంటున్నారు.

Taliban
Taliban

తాలిబాన్ వారు వాళ్ళని వివాహం చేసుకుని పాకిస్తాన్, వజీరిస్తాన్కు తీసుకువెళతారని చెబుతున్నారు. అక్కడ ఇస్లాం మతంలోకి వాళ్ళని మారుస్తారు అని ఈ నివేదికల ప్రకారం తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న ప్రాంతాలో వుండే అన్ని ఇమామ్‌లు మరియు ముల్లాలు తాలిబాన్‌కు 15 ఏళ్లు పైబడిన బాలికల వివరాలు, 45 ఏళ్లలోపు వితంతువుల వివరాలని ఇస్తే… తీసికెళ్ళి బానిసలుగా మారుస్తారని సాంస్కృతిక కమిషన్ పేరిట జారీ చేసిన లేఖలో తెలిపారు.

ఇది ఇలా ఉంటే గతంలో తాలిబాన్ పాలనలో మహిళలు స్కూల్స్ కి వెళ్లడం, ఇంటి నుండి బయటకి పని చేయడం లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో మగవాళ్ళు లేకుండా ఇంటిని వదిలి వెళ్ళడం వంటి రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ ని కనుక ఎవరైనా పాటించకపోతే తాలిబాన్ యొక్క మత పోలీసులు కొట్టేవారు.

ఇప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ పెద్దలు తాలిబాన్ తమ పిల్లలని తీసుకెళ్ళి బలవంతంగా వివాహం చేసుకుని బానిసలుగా మారుస్తారని అంటున్నారు. దీనితో అక్కడ వాళ్ళు బాధపడడం జరిగింది. ఇక్కడ వుండే పిల్లల్ని బలవంతంగా వివాహం చేసుకుంటారని నాకు తెలుసు అని బేగ్ చెప్పడం జరిగింది.

ఇది ఇలా ఉంటే మహిళల, బాలికలు హజారాస్ వంటి మైనారిటీలకి భద్రతని కల్పించాలని.. అలానే ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా మరియు అభివృద్ధి సహాయాన్ని పెంచాలని మే 14 లేఖలో వీళ్ళు అమెరికాను కోరారు.