అమెరికా, బెంగళూరు మధ్య తొలి నాన్ స్టాప్ ఫ్లైట్

శాన్ఫ్రాన్సిస్కో మరియు బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన మొట్టమొదటి నాన్-స్టాప్ సర్వీస్ ఈ రోజు ప్రారంభమవుతుంది. ఈ విమానం రెండు గ్లోబల్ టెక్ హబ్‌లను అనుసంధానిస్తుంది. అసలు సిలికాన్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా మధ్య ఈ విమానం నడుస్తుంది. ఇది జనవరి 9 న శాన్ఫ్రాన్సిస్కో నుండి 20: 30 గంటలకు (స్థానిక సమయం) బయలుదేరి జనవరి 11 న 0345 గంటలకు (స్థానిక సమయం) బెంగళూరు చేరుకుంటుంది.

శాన్ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరు వెళ్లే AI 176 విమానం శని, మంగళవారాల్లో నడుస్తుంది అని అధికారులు ప్రకటించారు. బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానం విటి ఎఎల్‌జితో పనిచేస్తుంది. ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ కాన్ఫిగరేషన్‌తో పాటు నాలుగు కాక్‌పిట్ మరియు 12 క్యాబిన్ సిబ్బందితో సహా 238 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ఉంటుంది.

ఈ విమానంలో కెప్టెన్ జోయా అగర్వాల్ (పి 1), కెప్టెన్ పాపగారి తన్మై (పి 1), కెప్టెన్ ఆకాన్షా సోనావేర్ (పి 2), కెప్టెన్ శివానీ మన్హాస్ (పి 2) అందరు మహిళా కాక్‌పిట్ సిబ్బంది నడుపుతారు. బెంగళూరు మరియు శాన్ఫ్రాన్సిస్కో మధ్య దూరం సుమారు 13,993 కిలోమీటర్లు అని 13.5 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా లేదా భారతదేశంలోని ఏ ఇతర విమానయాన సంస్థ అయినా సరే నడుపుతున్న ప్రపంచంలోనే అతి పొడవైన వాణిజ్య విమానంగా దీన్ని పేర్కొన్నారు.