లైంగిక్ వేధింపుల కేసులో ట్రంప్ దోషే.. మన్‌హట్టన్‌ ఫెడరల్‌ జ్యూరీ తీర్పు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అనైతిక సంబంధాన్ని దాచి ఉంచేందుకు అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నారన్న కేసులో 34 అభియోగాలను ఎదుర్కొంటున్న ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు మంగళవారం ఓ కేసులో ఏకంగా దోషిగా తేలారు.

1996లో మన్‌హటన్‌లోని ఓ స్టోర్‌లో రచయిత, కాలమిస్టు.. జీన్‌ కెరల్‌పై ట్రంప్‌ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని మన్‌హట్టన్‌ ఫెడరల్‌ జ్యూరీ నిర్ధారణకు వచ్చింది. పరిహారంగా ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. కెరల్‌ చేసిన అత్యాచార ఆరోపణల నుంచి మాత్రం 76 ఏళ్ల ట్రంప్‌నకు విముక్తి కలిగించింది. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఇది ఎదురుదెబ్బే. ఈ తీర్పు తనకు.. తనలాంటి బాధితులకు విజయం అని 79 ఏళ్ల కెరల్‌ తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news