వివాదంలో ట్రంప్‌ రన్నింగ్‌ మేట్‌.. యూకే ‘ఇస్లామిక్‌ దేశం’ అంటూ వాన్స్‌ కామెంట్స్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌ జె.డి.వాన్స్‌ను ఖరారైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. యూకే అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా మారే అవకాశం ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.

గతవారం జరిగిన యూకే కన్జర్వేటివ్‌ నేతల సదస్సులో పాల్గొన్న వాన్స్‌  మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాల విస్తరణ ఒకటని అన్నారు. దీన్ని బైడెన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వ్యాఖ్యానిస్తూ.. ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన తొలి దేశం ఏది అవుతుంది? అనే ప్రశ్న వస్తే ముందుగా ఇరాన్‌, పాకిస్థాన్‌ అవుతాయేమో అనుకున్నాం కానీ, చివరకు యూకే అని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారడంతో వాన్స్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాన్స్ వ్యాఖ్యలను యూకే ఉప ప్రధాని ఏంజెలా రేనెర్‌ స్పందిస్తూ ఖండించారు. వాన్స్‌ అభిప్రాయాలను తాము పెద్దగా పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news