నేను ఒక్కడ్నే అమెరికా చరిత్రలో కష్టపడింది.. నేనే నెంబర్‌ 1 : ట్రంప్

-

ఒక పక్క కరోనా వైరస్ తో జనాలు చస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఏది వస్తే అది మాట్లాడటం తో ఇప్పుడు అమెరికన్లు ఈయనకు ఎందుకు ఓటు వేసామా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రెండు రోజుల క్రితం ఫినాయిల్ ఎక్కిస్తే కరోనా చచ్చిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. తన మాటలపై మీడియా అనవసర రాద్దాంతం చేస్తుంది అన్నారు ఆయన. అమెరికాలో ఇప్పటి వరకు తాను ఒక్కడినే పని చేసిన అధ్యక్షుడ్ని అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉదయం మొదలు రాత్రి పొద్దు పోయేవరకు వైట్‌ హౌజ్‌లో పనిచేస్తూనే ఉంటానని, కొన్ని నెలలపాటు స్వేత సౌధాన్ని విడిచిపెట్టి వెళ్లింది లేదన్నారు ఆయన. కానీ, కొన్ని మీడియా సంస్థల్లో నన్ను విమర్శిస్తూ కథనాలు వచ్చాయని అసహనం వ్యక్తం చేసారు.

తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలు, ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసే సంస్థలపైన దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ ని బాగా టార్గెట్ చేసింది. ఆ దేశంలో కరోనా కేసులు 10 లక్షలకు చేరుకున్నాయి. మరణాలు కూడా 60 వేలకు దగ్గరగా ఉన్నాయి. రోజుకి 3 వేల వరకు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ట్రంప్ మారడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news