బ్రేకింగ్: గన్స్ తో రోడ్ల మీదకు ట్రంప్ బ్యాచ్…!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విధ్వంశం దిశగా అడుగులు వేస్తున్నారు. కోపంగా ఉన్న ట్రంప్ మద్దతుదారులు, వీధుల్లోకి భారీగా వచ్చారు. యుద్ధభూమిగా చెప్తున్న రెండు రాష్ట్రాల్లో… రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఫలితాలు వెలువడుతున్నట్లు కనపడుతున్న నేపధ్యంలో ట్రంప్ కోసం… ఆయన మద్దతుదారులు డెట్రాయిట్ మరియు ఫీనిక్స్ లోని ఓటు లెక్కింపు కేంద్రాలలో సమావేశమయ్యారు.

ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు లెక్కించవద్దు అని డిమాండ్ చేసారు. ఇక అన్ని ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ట్రంప్ వ్యతిరేక నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. లెక్కింపు ఆపాలి అంటూ ట్రంప్ మద్దతు దారులు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. ట్రంప్ సొంత రాష్ట్రం నిరసనలు, హింసపై ఎన్‌వైసిలో 50 మంది, పోర్ట్‌ల్యాండ్‌లో 10 మందిని అరెస్టు చేశారు.

పోలీసులు న్యూయార్క్‌లో 50 మందిని, పోర్ట్‌ల్యాండ్‌లో 10 మందిని అరెస్టు చేశారు. నిరసనకారుల నుండి బాణసంచా, సుత్తులు… రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నగరంలో జరుగుతున్న నిరసనలలో పాల్గొన్న 50 మంది అరెస్టులు చేసినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎన్వైపిడి) తెలిపింది. అట్లాంటా, డెట్రాయిట్, న్యూయార్క్ మరియు ఓక్లాండ్‌తో సహా పలు నగరాల్లో ఓటింగ్ ఆపాలి అంటూ డిమాండ్ లు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news