రన్‌పై నుంచి జారిన ఓ నిఘా విమానం ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. హవాయిలోని మెరైన్ కోర్ బేస్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నిఘా విమానం అమెరికా నౌకాదళానికి చెందినదని ఆ కోర్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ తెలిపారు. వెంటనే కోస్టు గార్డు సిబ్బంది అప్రమత్తమవ్వడంతో విమానంలోని సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రం వద్ద బోటింగ్ చేస్తున్న వారు ఒక్కసారిగా విమానం దూసుకురావడంతో షాకయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికా నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పీ-8ఏ పొసెడాన్ విమానం సబ్మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదని అధికారులు తెలిపారు. ఇది టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా తీసుకెళ్లగలదని వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మాత్రం వెల్లడించలేదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా పనిచేస్తోంది. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది.
🇺🇸 US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii
The P-8A "Poseidon" overshot the runway at a Marine base on Kaneohe Bay, said U.S. Marine Corps Spox Gunnery Sgt. Orlando Perez said that all nine people on board the aircraft made it safely to shore@DlugajJuly pic.twitter.com/ltXxVgpvCU
— Velerie (@velerie_a) November 21, 2023