చెత్తబుట్టలో పడేద్దాం అనుకున్న పెయింటిగ్‌కు వేలంలో రూ. 208 కోట్లు

-

మన ఇళ్లలో వాడని వస్తువులను కూడా భద్రంగా దాచుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. స్టోర్‌ రూమ్‌లో వేయడం, సన్‌సైడ్‌ మీద పడేయటం చేస్తుంటాం. అవి ఎందుకు పనికిరావని తెలిసినా వాటిని పడేయటానికి మనసొప్పదు. ఇళ్లు క్లీన్‌ చేసిన ప్రతిసారి వాటిల్లో మరీ వేస్ట్‌ అనుకున్నవాటిని తీస్తుంటాం. అన్నీ ఒకేసారి పడేయరు. అలానే ఓ ఇంట్లో 90 ఏళ్ల భామ్మ తన ఇళ్లు క్లీన్‌ చేస్తుండగా ఒక పెయింటింగ్‌ బయటపడింది. అది ఎందుకు పనికిరాదు పడేద్దాం అనుకుంది. కానీ సీన్‌కట్‌ చేస్తే ఆ పెయింటింగ్‌ వాల్యూ 208 కోట్లు పైమాటే..! ఇన్నాళ్లు ఇంట్లో అన్ని కోట్ల ఆస్తిని పెట్టుకుందా..!!

ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. వృద్ధురాలు ఇంట్లోని పెయింటింగ్‌ను తరచూ చూసేది. అయితే దీన్ని ఎవరు తయారు చేశారో, ఎంత ఖర్చవుతుందో తెలియలేదు. ఆమె ఇంట్లో ఈ పెయింటింగ్ ఎలా వచ్చిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కానీ పెయింటింగ్‌ 25 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 208 కోట్ల రూపాయలు అని తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ పెయింటింగ్ పేరు క్రైస్ట్ మోక్డ్. దీనిని ఇటాలియన్ చిత్రకారుడు సిమాబు రూపొందించారు. ఇది 13వ శతాబ్దానికి చెందిన పెయింటింగ్. ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

ఈ పెయింటింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? : ఈ పెయింటింగ్‌ను చిలీ బిలియనీర్ అల్వారో సైహ్ బెండెక్ మరియు అతని ఆర్థికవేత్త భార్య అనా గుజ్మాన్ అహ్న్‌ఫెల్డ్ వారి వ్యక్తిగత సేకరణ కోసం కొనుగోలు చేశారు. పెయింటింగ్ కోసం ఎగుమతి లైసెన్స్ మంజూరు చేయడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం నిరాకరించడంతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఈ పెయింటింగ్ మ్యూజియంలో ఉంచారు. ఈ పెయింటింగ్‌ను ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో ఉంచాలని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది.

పెయింటింగ్ ఉంచడానికి మ్యూజియం డబ్బు చెల్లించాలి: ఈ అందమైన పెయింటింగ్ మ్యూజియంలో శాశ్వతంగా ఉండటానికి మ్యూజియం డబ్బు చెల్లించాలి. అయితే మ్యూజియంకు ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్న సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.

ఆరోజు జరగనున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్ : రూ.208 కోట్లకు వేలం వేయనున్న అమ్మమ్మ ఇంట్లోని క్రైస్ట్ మోక్డ్ పెయింటింగ్‌ను 2025లో జరిగే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సిమాబు వేసిన మరో పెయింటింగ్ ఏమిటి? : ఇటాలియన్ చిత్రకారుడు సిమాబు వేసిన మరో పెయింటింగ్ పేరు మేస్టా. ఇది ఇప్పటికే మ్యూజియంలో ఉంచారు. ప్రస్తుతం దాని మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news