అలా చేస్తే రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది… బైడెన్ హెచ్చరిక

-

క్వాడ్ సమావేశంలో జపాన్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చైనాకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ ను చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జోబైడెన్ హెచ్చరించారు. తైవాన్ ను ఆక్రమించుకునే హక్కు చైనాకు లేదన్నారు. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడ్డ రష్యా పరిస్థితే… చైనాకు పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చూస్తే చైనాను సైనిక పరంగా అడ్డుకుంటామని జోబైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ పై దాడికి రష్యా మరింత మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. 

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత రష్యాకు చైనా సహాయం చేస్తుందని పాశ్చత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్దం తరువాత చైనా, తైవాన్ ను టార్గెట్ చేస్తుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. తైవాన్ దేశం వన్ చైనా విధానంలో భాగమని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటోంది. ప్రపంచం కూడా వన్ చైనా విధానాన్ని అంగీకరించాలని కోరుతోంది. వన్ చైనా విధానంలో హాంకాంగ్, తైవాన్ దేశాలు కూడా చైనాలోని భాగాలే అని వాదిస్తోంది. గతంలో చాాలా సందర్భాల్లో తైవాన్ ఏయిర్ స్పెస్ రూల్స్ ను పట్టించుకోకుండా చైనా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు తైవాన్ గగన తలంలోకి వచ్చి కవ్వించాలని ప్రయత్నించాయి.

Read more RELATED
Recommended to you

Latest news