నడిరోడ్డుపై తుపాకీతో యువతి హల్​చల్.. వీడియో వైరల్

-

అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం ఎక్కడో చోటా తుపాకీ మోత వినిపిస్తూనే ఉంది. తాజాగా ఓ మహిళ నడిరోడ్డుపై తుపాకీతో హల్​చల్ సృష్టించింది. గన్ పట్టుకుని సంచరిస్తూ స్థానికులను భయపెట్టింది. ఎదురుగా ఉన్నవారికి తుపాకీ గురిపెడుతూ, గాలిలో కాల్చి హల్‌చల్‌ చేసింది.

నసౌ కౌంటీలోని నార్త్‌ బెల్మూరులో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఓ మహిళ తుపాకీతో రోడ్డుపై తిరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే మహిళ ఉన్న చోటుకు వెళ్లారు. అప్పటికే నడిరోడ్డుపై భారీగా వాహనాలు ఉన్నవేళ ఆ మహిళ ఒకసారి గాలిలోకి కాల్పులు జరిపి ఆ తర్వాత ఎదురుగా ఉన్న కార్లవైపు తుపాకీ ఎక్కుపెట్టి.. రోడ్డు దాటుతూ తన తలకే గురిపెట్టుకుంది.

దీంతో పోలీసులు తమ వాహనంతో ఆమెను ఢీకొట్టి కింద పడేలా చేశారు. క్షణాల్లోనే ఆమెను చుట్టుముట్టి తుపాకీని తీసుకుని ఆమెను బంధించారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. పెను ప్రమాదాన్ని తప్పించి సకాలంలో స్పందించిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news