ఏపీలో సిఎం జగన్‌కు ఎక్కడా కూడా ప్రజాదరణ తగ్గడం లేదు. అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్‌కు ప్రజా మద్ధతు ఎక్కువగానే ఉంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. దీంతో ఆయనకు ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల సర్వేల్లో తేలింది. అయితే జగన్‌ని ఓడించడానికి చంద్రబాబు-పవన్ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో వీరు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్‌కు మేలు జరిగిందని, ఈ సారి అలా జరగకూడదని ఇద్దరు నేతలు భావించి పొత్తు దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తులో జగన్‌కు చెక్ పెట్టవచ్చు అనేది వారి ప్లాన్. అయితే పొత్తు ఉన్నా లేకపోయినా జగన్‌కు బాబు, పవన్ చెక్ పెట్టలేరని తెలుస్తోంది. తాజాగా వచ్చిన నేషనల్ సర్వేలో అదే తేలింది. టైమ్స్ నౌ మరో కొత్త సర్వే విడుదల చేసింది. జూన్-ఆగష్టు 12 వరకు చేసిన సర్వేలో వైసీపీకి ఫుల్ లీడ్ ఉన్నట్లు తెలిసింది.
వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు వస్తాయని, టిడిపికి 0-1 ఎంపీ సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేలింది. దీంతో జగన్ హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక వైసీపీకి 51 శాతం పైనే ఓట్లు, టిడిపికి 36 శాతం, జనసేనకు 10 శాతం ఓట్లు ఇతరులకు 3 శాతం ఓట్లు వరకు పడతాయని సర్వేలో తేల్చి చెప్పింది.
అంటే ఇక్కడ టిడిపి-జనసేన కలిసిన 46 శాతం అవుతుంది..దీంతో వైసీపీకి ఉన్న 51 శాతం దాటడం కష్టం. గత ఎన్నికల్లో కూడా వైసీపీకి 49 శాతం, టిడిపికి 39 శాతం, జనసేనకు 7 శాతం వరకు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు వైసీపీ ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుంది. మొత్తం మీద బాబు-పవన్ కలిసిన..జగన్‌ని దాటలేరు.