బ్రిట‌న్‌లో అమ్మాయిల‌ను వ‌ర్జినిటీ రిపెయిర్ కోసం బ‌ల‌వంత‌పెడుతున్న త‌ల్లిదండ్రులు.. బ్యాన్ చేయాల‌ని స‌ర్వ‌త్రా డిమాండ్‌..!

అమ్మాయిలు క‌న్య‌లుగానే ఉన్నారా, లేదా అని తెలుసుకునేందుకు ప‌రీక్ష‌లు చేయ‌డం మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ నిషిద్ధం. ఇది చాలా హేయ‌మైన చ‌ర్య‌. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ముంద‌స్తుగానే క‌న్నె పొర చిరిగిపోతే దాన్ని మునుప‌టిలా మార్చేందుకు బ్రిట‌న్‌లో ప‌లు క్లినిక్‌లు వ‌ర్జినిటీ రిపెయిర్ ఆప‌రేషన్లు చేయ‌డం ప్రారంభించాయి. దీంతో త‌ల్లిదండ్రులు అలాంటి త‌మ కుమార్తెల‌కు స‌ద‌రు ఆప‌రేష‌న్ల‌ను చేయించేందుకు వారిని బ‌ల‌వంత‌పెడుతున్నారు.

 

virginity-repai

బ్రిటిన్‌లో వ‌ర్జినిటీ రిపెయిర్ ఆప‌రేషన్లు చేసే క్లినిక్‌లు పెరిగాయని, ఇది చాలా ప్ర‌మాద‌మని, హేయ‌మైన చ‌ర్య అని ది రాయ‌ల్ కాలేజ్ ఆప్ ఆబ్‌స్టెట్రిషియ‌న్స్ అండ్ గైనకాల‌జిస్ట్స్ (ఆర్‌సీవోజీ) బ్రిట‌న్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. అలాగే IKWRO అనే స్వ‌చ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డ‌యానా న‌మ్మి స్పందిస్తూ.. క‌న్నె పొర చిరిగిన అమ్మాయిల‌కు ఈ విధంగా ఆప‌రేష‌న్లు చేసి వారిని మునుప‌టిలా క‌న్య‌లుగా మార్చ‌డం అంటే వారి హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మేన‌ని, భ‌విష్య‌త్తులో వారి జీవిత భాగ‌స్వాముల‌ను మోసం చేసిన‌ట్లు అవుతుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ప్ర‌స్తుతం ఇలా ఆప‌రేష‌న్ల‌ను బ్యాన్ చేయాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇక బ్రిట‌న్‌లో అలాంటి ఆప‌రేష‌న్లను చేసే క్లినిక్‌లు 22 వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. వారు ఆ ఆప‌రేష‌న్ల‌ను చేసేందుకు భారీ ఫీజుల‌ను వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఈ విధంగా చేసే ఆప‌రేష‌న్‌ను హైమెనోప్లాస్టీ అంటారు. ఈ క్ర‌మంలో చిరిగిన క‌న్నె పొర మీద మ‌రొక పొర చ‌ర్మాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో అమ్మాయి క‌న్య అవుతుంది. అయితే ఈ విధ‌మైన ఆప‌రేష‌న్ గురించి అక్క‌డ గూగుల్‌లో వెదికే వారి సంఖ్య కూడా పెరుగుతుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ఏడాది కాలంలో అక్క‌డ 9000 వ‌ర‌కు దీని గురించి గూగుల్‌లో వెదికారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్జినిటీ రిపెయిర్ ఆప‌రేష‌న్ల‌ను బ్యాన్ చేయాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు.