కాబూల్ దాడులు: ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్న బైడెన్

-

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక కాబూల్ ఎయిర్ పోర్టుపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో చాలామంది అమెరికా సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తమ సైనికులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసేసిన వారిపై చర్య తీసుకుంతామని, దాడిపై అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటామని, ఆఫ్ఘన్ లో ఉన్న అమెరికా పౌరులను రక్షించుకుంటామని బైడెన్ తెలిపారు. దాడులకు పాల్పడ్డ వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం అని బైడెన్ హెచ్చరించారు.

వైట్ హౌస్ నుండి స్పందించిన బైడెన్ తమ సైనికుల ప్రాణాలు పోయినందుకు కన్నీటి పర్యంతం అయ్యారు. మొత్తం 13మంది ప్రాణాలు కోల్పోయారు. మేము ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోమని, ఇంకా ఎప్పటికీ క్షమించలేమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ తెలిపాడు. మరో పక్క కాబూల్ దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని తెలుస్తుందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news