ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. మెటా కు చెందిన వాట్సప్ లో ఇక నుంచి క్రిప్టో కరెన్నీ లావాదేవీల కు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పైలట్ ప్రాజెక్ట్ గా అమెరికా లోని కొందరి యూజర్ల కు నోవి అనే పేరు తో ఈ ఫీచర్ ను అందుబాటు లోకి తెచ్చింది. అయితే అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ పై అనుమానులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ వల్ల తమ దేశాలు ఆర్థికం గా తీవ్రం గా నష్ట పోతాయని ఆందోళన చెందుతున్నాయి. అలాగే క్రిప్టో కరెన్సీ చట్ట బద్దత పై కూడా పలు దేశాలు తీవ్రం గా చర్చిస్తున్నాయి.
ఇలాంటి సందర్భం లో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం తో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ పై పలు దేశాలు అభ్యంతరాలు తెలుపుతున్నా.. టెక్నాలిజీ దిగ్గజాలు మాత్రం క్రిప్టో కరెన్సీ కే ఓటు వేస్తున్నారు. అంతే కాకుండా వీటి లలో భారీ గా పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఎలన్ మస్క్, టిమ్ కుక్ వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటి కే పలు క్రిప్టో కరెన్సీ లలో పెట్టుబడులు పెట్టారు. అయితే వాట్సప్ నోవీ వాలెట్ అనే పేరు తో క్రిప్టో లావాదేవీలు జరుపుకునేందుకు వీలు గా మెటా తీసుకువస్తుంది. దీంతో క్రిప్టో లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది మంచి విషయం అనే చెప్పవచ్చు.