అమెరికా ఉపాధ్యక్షురాలి మేనకోడల్ని మందలించిన వైట్ హౌస్.. కారణం ఏంటంటే?

Join Our Community
follow manalokam on social media

అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ పై వైట్ హౌస్ సిబ్బంది మందలింపు చర్య వైరల్ గా మారింది. కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్, తన అత్త చరిష్మాని వాడుతూ వ్యాపార కార్యకలాపాలని కొనసాగిస్తుంది. కమలా హ్యారిస్ పేరుని ఉపయోగించుకుని తన బిజినెస్ వ్యవహారాలని మార్కెట్ చేసుకుంటుంది. తాజాగా ఇలా ఉపయోగించుకోవడాన్ని వైట్ హౌస్ సిబ్బంది తప్పు బట్టింది. అమెరికా ఉపాధ్యాక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ పేరుని ఉపయోగిస్తూ, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపింది.

అంతే కాదు ఈ విషయమై మీనా హ్యారిస్ కి వైట్ హౌస్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలా హ్యారిస్ పేరుని, ఉపాధ్యక్షురాలిగా చెబుతూ కూడా ఎక్కడా ఉపయోగించవద్దని తెలిపింది. మీనా హ్యారిస్ పూర్తి పేరు మీనాక్షి హ్యారిస్. ఇప్పటివరకు ఒక పుస్తకం కూడా రాసిన మీనాక్షి హ్యారిస్, తన ఆలోచనలకి కమలా హ్యారిస్ పేరుని ఉపయోగిస్తూ ఉంటుంది.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...