అనుష్కతో సైలంట్ గా సినిమా స్టార్ట్ చేసిన యువి బ్యానర్

అందాల అనుష్క యువి క్రియేషన్స్ ను ఇప్పట్లో వదిలేట్లుగా లేదు.ఓ వైపు పొన్నియన్ సెల్వంకు డేట్స్ ఇచ్చి నిన్నటివరకు కలిసొచ్చిన యువీలో మరో సినిమాకు రెఢీ అయిపోయింది.ఎలాంటి హడావిడి లేకుండా అనుష్క ఎందుకు యువిలో ఫిలిం చేస్తున్నట్లు అన్న గుసగుసలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్ అనుష్క..నేటితరం ట్రెండీ బ్యూటీస్ రాకతో పోటీలో కాస్త వెనక పడింది.అయినప్సటికీ తనకుండే పాత్రలు, ఛాన్స్ లు ఉండనే ఉన్నాయి.ఐతే అలా చేసే రోల్స్ ఏవి గ్లామర్ పాత్రలు కాకపోవడంతో సోలో గానే పర్ ఫార్మెన్స్ చూపించాల్సి వస్తుంది.గత కొంతకాలంగా అలా చూపించే కెరియర్ ను నెట్టుకొంటూ వస్తున్న అనుష్క ..ఇకముందు కూడా ఈతరహాలోనే అడుగులు వేయాలని ఫిక్స్ అయిపోయింది.

రీసెంట్ గా అనుష్క నిశ్శబ్దం లాంటి ఫిలింతో పర్ ఫార్మెన్స్ చూపించినప్పటికీ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోలేక పోయింది.దీంతో మళ్లీ తనకు కలిసొచ్చిన కాంపౌండ్లోనే సినిమాలు చేయాలని డిసైడ్ అయింది.దానిలో భాగంగాయువి క్రియేషన్స్ తో మళ్లీ కలిసింది.ఇప్పటికే ఈ ప్రొడక్షన్లో మిర్చి,భాగమతితో రెండు హిట్లు కొట్టిన అనుష్క..ఈసారి రారా కృష్ణయ్య దర్శకుడు పి.మహేష్ బాబుతో చేసే సినిమాతో హ్యాట్రిక్ పడుతుందని ఆశపడుతుంది.

అనుష్క చేతిలో ప్రస్తుతం పొన్నియన్ సెల్వం ప్రాజెక్ట్ ఉంది.తెలుగులో ప్రస్తుతానికి అయితే యువి బ్యానర్
ఫిలిం మాత్రమే మిగిలింది.ఇక ఈసినిమా మ్యాటర్లో ఎందుకు ఎలాంటి హడావిడి లేకుండా సినిమా స్టార్ట్ చేశారంటే మాత్రం ఆన్సర్ చేయడం లేదు.ఒకవేల చేసినా… పాత గాసిప్స్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని అనుకుని ఉండవచ్చు.

ఇప్పటికే ఓసారి పబ్లిక్ గా యువిక్రియేషన్స్ నా ఫ్యామిలీ బేనర్ అంటూ అనుష్క స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.అప్పటినుంచి అనుష్కను యువి బ్యానర్ మనిషిగానే పరిశ్రమ ట్రీట్ చేస్తుంది.