కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు…!

-

మన దేశంలో అడుగడుగునా ఆధ్యాత్మికత కనబడుతుంది. ఎన్నో ప్రాచీనమైన ఆలయాలకు, మరెన్నో రహస్యాలకు నెలవు. అక్కడ ఉన్న ఆంజనేయుడిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెపుతారు. ఇంతకి ఆ ఆలయం ఎక్కడ ఉందో, ఆ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

తెలంగాణా రాష్ట్రంలోని కరీం నగర్ జిల్లా జగిత్యాలనుంచి 15 కిలోమీటర్ల దూరం, మల్యాల మండలంలోని ముత్యం పేట గ్రామం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారి విగ్రహం విభిన్న రూపంలో ఉంటుంది. ఒక వైపు అంజన్న దర్శనమిస్తే, మరొక వైపు నార సింహుడి ముఖం ఉంటుంది. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి పురాణ చరిత్ర కూడా ఉంది. త్రేతా యుగంలో రామ , రావణ యుద్ద సమయంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సంజీవని తెచ్చే క్రమంలో ఆ మూలికలు ఉన్న పర్వతం పెకలించుకుని తెస్తుంటే కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని అదే ఈ కొండ గట్టుగా ప్రసిద్ధి చెందిందని చెపుతారు. ఇలా రెండు ముఖాలతో ఉన్న ఆలయం మన దేశంలోనే కాక, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విగ్రహంలో మరో విశేషం శంఖు, చక్రాలతో పాటు హృదయంలో సీతా రాములను కలిగి ఉండటం. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news