ఆ ఊర్లో అగ్రిమెంట్ రాసుకున్న వైసీపీ – టీడీపీ.. చివర్లో ట్విస్ట్ !

Join Our Community
follow manalokam on social media

ఏపీ మొత్తం మీద వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్కో చోట ఈ రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకుంటున్న వైనం ఆసక్తికరంగా మారింది. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీ సర్పంచ్‌ పదవిని వైసీపీ, టీడీపీ మద్దతుదారులు పంచుకున్నారు. అంతే కాదు మాట మీద నమ్మాకాలు లేకపోవడంతో ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఇరు వర్గాల వారు సంతకాలు కూడా చేశారు.

మూడు సంవత్సరాలు వైసీపీ మద్దతుదారుడు, మరో రెండు  సంవత్సరాలు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌ పదవిలో ఉండేటట్టు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని డాక్యుమెంట్‌ పేపర్ల మీద ఒప్పందం కూడా రాసుకున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కొందరు నామినేషన్లు వేయడంతో వీరికి షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ వ్యవహారం అంతా హొంమంత్రి సుచరిత నియోజకవర్గంలో జరగడంతో ఈ పంపకాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 21న ఇక్కడ ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో అగ్రిమెంట్ ప్రకారం సర్పంచ్ పదవిని పంచుకుంటారా లేక ఎన్నికలు జరుతాయా అన్నది ఆసక్తిగా మారింది. 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....