ఫెమీనా మిస్ ఇండియా 2020 కిరీటం గెలుచుకున్న తెలంగాణ అమ్మాయి..

Join Our Community
follow manalokam on social media

వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా హైదరాబాద్ కి చెందిన మానస వారణాసి దక్కించుకుంది. ఇంజనీర్ గా పనిచేస్తున్న 23ఏళ్ళ మానస ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఫెమీనా మిస్ గ్రాండ్  ఇండియా 2020గా హర్యానా అమ్మాయి మానిక షెకాండ్ గెలుచుకోగా మిస్ ఇండియా రన్నరప్ 2020గా ఉత్తరప్రదేశ్ అమ్మాయి మాన్యా సింగ్ నిలిచింది. 2019లో ఫెమీనా మిస్ ఇండియా కిరీటం అందుకున్న సుమన్ రావు మానసకి కిరీటాన్ని అందించింది. ఈ సంవత్సరం జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకి మనదేశాన్ని మానస ప్రాతినిథ్యం వహించనుంది.

ఫెమీనా మిస్ ఇండియాకి న్యాయ నిర్ణేతలుగా బాలీవుడ్ నటీమణులైన నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్ ఇంకా డిజైనర్ ఫాల్గుని, షేన్ పీకాక్ ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ నటి వాణీ కపూర్ అద్బుతమైన పర్ ఫార్మెన్స్ తో అలరించింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీన కలర్స్ టీవీలో రానుంది. మిస్ ఇండియా గెలుచుకున్న మానస మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...