డిజిట‌ల్ రూపంలో బంగారాన్ని కొనండి.. డ‌బ్బులు ఆదా చేసుకోండిలా..!

-

కేంద్ర ప్ర‌భుత్వం 2015 న‌వంబ‌ర్‌లో సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీంను ప్ర‌వేశపెట్టిన విష‌యం విదిత‌మే. ఈ స్కీం కింద వినియోగ‌దారులు బంగారాన్ని భౌతిక రూపంలో కాకుండా బాండ్స్ రూపంలో కొనుగోలు చేసి డ‌బ్బులు పొదుపు చేసుకోవ‌చ్చు. బంగారంపై పెట్టుబ‌డులు కూడా పెట్ట‌వ‌చ్చు. దీంతో భౌతిక రూపంలో ఉండే బంగారానికి డిమాండ్ త‌గ్గుతుంది. కేంద్రంపై భారం ప‌డ‌కుండా ఉంటుంది. అయితే ఈ స్కీంలో భాగంగా ఏడో విడ‌త బంగారం కొనుగోళ్ల‌కు కేంద్రం తాజాగా ద్వారాలు తెరిచింది.

invest in sovereign gold bond scheme

సావ‌రిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) స్కీం 2020-21 ఏడో విడ‌త కొనుగోలు కార్య‌క్ర‌మాన్ని కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగ‌దారులు మార్కెట్ రేట్ క‌న్నా త‌క్కువకే బంగారాన్ని కొన‌వ‌చ్చు. ఈ స్కీంలో గ్రామ్ బంగారాన్ని రూ.5,051 ఫిక్స్‌డ్ రేట్ కే కొనుగోలు చేసే అవ‌కాశాన్ని ఆర్‌బీఐ అందిస్తోంది.

ఎస్‌జీబీ స్కీం కింద బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొంటే అద‌నంగా మ‌రో రూ.50 రాయితీ ఇవ్వాల‌ని ఆర్‌బీఐ నిర్ణ‌యించింది. దీంతో ఈ స్కీంలో ఆన్‌లైన్ ద్వారా బంగారాన్ని కొంటే గ్రామ్ బంగారం కేవ‌లం రూ.5,001కే ల‌భిస్తుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీం 2020-21 సిరీస్ 7 అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌ని ఆర్‌బీఐ తెలియ‌జేసింది. సిరీస్ 6 ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగింది. అప్పుడు గ్రామ్ బంగారాన్ని రూ.5,117 కు విక్ర‌యించారు. ఇక సిరీస్ 8 న‌వంబ‌ర్ 9 నుంచి 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఆ సిరీస్ ప్రారంభానికి ముందు గ్రామ్ బంగారం ధ‌ర‌ను నిర్ణ‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news