అదిరే LIC పాలసీ… రూ. కోటి వరకూ ప్రయోజనాలు…!

-

ఈ మధ్యన ప్రతీ ఒక్కరు డబ్బులని నచ్చిన స్కీమ్స్ లో పెట్టాలని చూస్తున్నారు. ఇలా డబ్బులని పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. బీమా రంగంలో ఎల్ఐసీ కి అత్యధిక ప్రజాదరణ వుంది. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. రిస్క్ కూడా ఉండదు. దీని పేరు ధన్ రేఖ పాలసీ. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఈ పాలసీ పేరు ధన్ రేఖ పాలసీ. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ.

ఈ పాలసీ లో మహిళలకు స్పెషల్ ప్రీమియం రేట్స్ ఉంటాయి. థర్డ్ జెండర్‌కు కూడా ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. ఈ పాలసీ ని తీసుకుంటే నిర్ణీత సమయాల్లో చేతికి డబ్బులు వస్తాయి. అలానే మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి డబ్బులొస్తాయి.

రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకునే అవకాశం వుంది. గరిష్ట పరిమితి ఉండదు. డెత్ కవర్ అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ప్రీమియంతో అధిక లైఫ్ కవర్‌ను ఈ పాలసీ ఇస్తుంది. ఒకేసారి ప్రీమియం మొత్తం పే చెయ్యచ్చు. నెలవారీగా కూడా చెల్లించుకోవచ్చు. ఈ పాలసీ ని 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల టర్మ్‌తో తీసుకోవచ్చు. 20 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే మీరు పదేళ్ల వరకు ప్రీమియం కట్టాలి. 30 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం ఉంటుంది.

పన్ను ప్రయోజనాలని కూడా పొందొచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు వారు దీన్ని తీసుకోవచ్చు. మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు 70 ఏళ్ళు. ఇక ఎంత వస్తుందనేది చూస్తే… సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియం చెల్లించేలా ఉంటే బీమా మొత్తం రూ. 50 లక్షలు. కవరేజీని పెంచుకోవడానికి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ని ఎంచుకుంటే… ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే కుటుంబానికి రూ.50 లక్షల బీమా మొత్తం వస్తుంది. అదనంగా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉంటే రూ. 50 లక్షలు కుటుంబ సభ్యులు కి వస్తాయి. మొత్తం రూ. కోటి వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news