కరెన్సీ నోట్లతో ప్రమాదం పెరుగుతోందా…?

-

కిరాణా షాప్ నుండి షాపింగ్ మాల్ వరకు..గల్లా పెట్టలు, జేబులు, బ్యాంక్ కట్టలు, ఏటీఎం లు..
కరెన్సీ నోటు ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఒక్క రోజులో ఎన్నో చేతులు మారుతుంది.
గతంలో అయితే ఇది పట్టించుకునే విషయం కాదు. కానీ, ఇప్పుడు అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
మనిషి చేత్తో టచ్ చేసిన వస్తువైనా, ప్రదేశమైనా వైరస్ కి నిలయంగా మారుతున్నాయి. ఇందులో కరెన్సీ నోటు కీలకంగా కనిపిస్తోంది.

కరెన్సీ నోట్ల తో కరోనా వస్తుందనే చర్య కరోనా మొదట్లోనే వినిపించింది. అప్పటినుంచే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ కూడా అదే చెప్తోంది. కరెన్సీ నోట్లను పట్టుకుంటే, కరోనా వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందని చెప్తోంది రిజర్వ్ బ్యాంక్. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి తరుణంలో.. కరెన్సీతో కరోనా అనగానే హడలెత్తుతున్నారు జనాలు.

కరెన్సీ ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా డిజిటల్ లావాదేవీలు పెంచటానికి ప్రోత్సాహకాలు ప్రకటించాలని ప్రభుత్వాలను కోరింది ఆర్బీఐ. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై బ్యాంక్ ఛార్జీలు మాఫీ చేయాలనే వాదనలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలంటే… ప్రభుత్వం నేరుగా ఆ బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news