యాపిల్ గుడ్ న్యూస్‌.. ఐఓఎస్ 14 రిలీజ్ నేడే.. మీ డివైస్ లిస్ట్‌లో ఉందేమో చూసుకోండి..!

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తాజాగా నిర్వ‌హించిన త‌న వ‌ర్చువ‌ల్ ఈవెంట్‌లో కొత్త‌గా వాచ్ సిరీస్ 6 వాచ్‌ల‌ను, వాచ్ ఎస్ఈ బ‌డ్జెట్ యాపిల్ వాచ్‌ను, 8వ జ‌న‌రేష‌న్ ఐప్యాడ్‌, 4వ జ‌న‌రేషన్ ఐప్యాడ్ ఎయిర్‌ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఇక ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా ఐఓఎస్ 14ను నేడు (బుధ‌వారం) విడుద‌ల చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ప‌లు డివైస్‌ల‌కు ఐఓఎస్ 14 అప్‌డేట్ నేడు విడుదల కానుంది.

ios 14 will be releasing today check your apple device is in the list or not

ఐఓఎస్ 14 అప్‌డేట్ పొంద‌నున్న యాపిల్ డివైస్‌ల వివ‌రాలు…

* ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్ మ్యాక్స్‌, ఎక్స్ఆర్‌, ఐఫోన్ ఎక్స్
* ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, 7, 7 ప్ల‌స్‌, ఐఫోన్ 6ఎస్‌, 6ఎస్ ప్ల‌స్‌, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ 2020
* ఐపాడ్ ట‌చ్ 7వ జ‌న‌రేష‌న్

పైన తెలిపిన ఐఫోన్ల‌తోపాటు, ఐపాడ్ ట‌చ్ 7వ జ‌న‌రేష‌న్ డివైస్‌ల‌కు ఐఓఎస్ 14 అప్‌డేట్ ల‌భ్యం కానుంది. ఇక ఈ కొత్త ఓఎస్‌లో ప‌లు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

* యాపిల్ డివైస్‌ల స్క్రీన్‌పై స్మార్ట్ స్టాక్ పేరిట విడ్జెట్ల‌ను సెట్ చేసుకోవచ్చు. యూజ‌ర్లు ఉన్న ప్ర‌దేశం, చేస్తున్న యాక్టివిటీ, నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో ఆ విడ్జెట్ల‌ను క‌నిపించేలా సెట్ చేయ‌వ‌చ్చు.

* డివైస్‌లో ఉన్న యాప్ లైబ్ర‌రీ యాప్‌ల‌న్నింటినీ కేట‌గిరి వారిగా ఆర్గ‌నైజ్ చేస్తుంది. యూజ‌ర్ ఉన్న లొకేష‌న్‌, టైం, యాక్టివిటీ ఆధారంగా యాప్స్‌ను స‌జెస్ట్ చేస్తుంది.

* ఫేస్‌టైం కాల్‌లో ఉన్న‌ప్పుడు యూజ‌ర్లు పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ మోడ్ ద్వారా వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. అందువ‌ల్ల కాల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.

* కొత్త అప్‌డేట్‌లో ట్రాన్స్‌లేట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 11 భాష‌ల్లో ట్రాన్స్‌లేష‌న్ అందుబాటులో ఉంది. ఫోన్‌ను ల్యాండ్ స్కేప్ మోడ్‌లోకి తిప్పి మైక్రోఫోన్ బ‌ట‌న్‌పై ట్యాప్ చేసి అనంత‌రం ఏదైనా మాట్లాడితే దాన్ని ఇత‌ర భాష‌లోకి సుల‌భంగా ట్రాన్స్‌లేట్ చేయ‌వ‌చ్చు.

* గ్రూప్ సంభాష‌ణ‌ల్లో ఏదైనా మెసేజ్‌కు నేరుగా రిప్లై ఇవ్వ‌వ‌చ్చు. అలాగే పూర్తి సంభాష‌ణ‌ల్లోని రిప్లైల‌ను చూడ‌వ‌చ్చు.