ఐఫోన్ 12 విడుద‌ల తేదీలు లీక్‌.. ఫోన్ల లాంచింగ్ ఎప్పుడంటే..?

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ త్వ‌ర‌లో ఐఫోన్ 12 ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఐఫోన్ 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట మొత్తం 3 ఫోన్ల‌ను విడుద‌ల చేయాల‌ని యాపిల్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే తాజాగా ఆయా ఫోన్ల విడుద‌ల‌కు సంబంధించిన తేదీలు లీక‌య్యాయి. ప్ర‌తి ఏడాది యాపిల్ సెప్టెంబ‌ర్ నెల‌లోనే కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేస్తుంది. కానీ ఈ సారి క‌రోనా కార‌ణంగా ఐఫోన్ల విడుద‌ల ఒక నెల ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

iphone 12 launching dates leaked

యాపిల్ త‌న ఐఫోన్ 12 ఫోన్ల‌ను అక్టోబ‌ర్ 13వ తేదీన లాంచ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్ట‌ర్‌లో ఐఫోన్ 12 విడుద‌ల తేదీలు లీక‌య్యాయి. సెప్టెంబ‌ర్ 7వ తేదీన యాపిల్ కొత్త వాచ్‌, ఐప్యాడ్‌ల‌ను విడుద‌ల చేస్తుంద‌ని, అలాగే అక్టోబ‌ర్ 13న నిర్వ‌హించ‌నున్న ఈవెంట్‌లో ఐఫోన్ 12 మోడ‌ల్స్ విడుద‌ల‌వుతాయ‌ని తెలిసింది. అలాగే ఐఫోన్ 12 మోడ‌ల్స్ విడుద‌ల కాగానే వాటికి ప్రీ ఆర్డ‌ర్ల‌ను నిర్వ‌హిస్తార‌ని, అక్టోబ‌ర్ 19 నుంచి వాటిని విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది. ఇక ఐఫోన్ 12 ప్రొ మోడ‌ల్స్‌ను న‌వంబ‌ర్‌లో విక్ర‌యించ‌నున్న‌ట్లు స‌మాచారం.

కాగా ఐఫోన్ 12 ఫోన్ల‌లో 5జి ఫీచ‌ర్‌ను అందివ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే వాటి డిజైన్ ఒక‌ప్పుడు వ‌చ్చిన ఐఫోన్ 4ను పోలి ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఐఫోన్ 12 ఎంట్రీ లెవ‌ల్ 4జి ఫోన్‌ను యాపిల్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో విడుద‌ల చేస్తుంద‌ని ఇది వ‌ర‌కే వార్త‌లు వ‌చ్చాయి. కాగా తాజాగా ఐఫోన్ 12 ఫోన్ల లాంచింగ్ డేట్లు లీక‌వ‌డంతో ఆ ఫోన్ల కోసం ఐఫోన్ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news