కీలకమైన మ్యాచ్ లో కేకేఆర్ దుమ్ము రేపింది. ముంబైపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబైనీ 17 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ చేసింది కేకేఆర్. దీంతో ముంబై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇషాన్ కిషన్ 51 పరుగులు మినహా ఎవరూ కూడా రాణించలేదు. దీంతో ముంబై 52 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ సీజన్ లో ఆడాల్సిన మ్యాచులు ఇంకా మిగిలి ఉండగానే.. ముంబై సరికొత్త చెత్త రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ముంబాయి మళ్లీ కం బ్యాక్ అంటూ ఓటముల వైపు మళ్ళింది. ఐపిఎల్ 2009, 2014 మరియు 2018 లో ముంబై ఇండియన్స్ జట్టులో అత్యధికంగా 8 మ్యాచ్లో ఓటమి పాలైంది.
అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన కేవలం రెండిటిలో గెలిచి తొమ్మిది మ్యాచ్ల్లో ఓడి పోయింది. దీంతో ఇప్పటి వరకు ఒకే సీజన్లో తొమ్మిది మ్యాచ్ ఓడిపోయి చెత్త రికార్డును నమోదు చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇంకా మ్యాచ్లు మిగిలి ఉండటంతో.. ఆ మ్యాచ్లో ముంబై గెలుస్తుందా లేదో తెలియాల్సి ఉంది.