IPL 2022 : ఐపీఎల్‌ 2022 ప్రోమో రిలీజ్‌..చెన్నై కెప్టెన్‌ గా జడేజా !

-

ఐపీఎల్ – 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. ఇప్ప‌టికే జ‌రిగిన మెగా వేలంలోనూ ఈ రెండు కొత్త ప్రొంఛైజీలు నాణ్య‌మైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్‌ పై క్రేజ్‌ బాగా పెరిగింది. అయితే.. తాజాగా ఐపీఎల్‌ 2022 కు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేసింది బీసీసీఐ.

కొన్నేళ్లుగా ఐపీఎల్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించిన ధోని.. ఈ ప్రోమోలో బస్సు డ్రైవర్‌ అవతారంలో మెరిసాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు బస్సును వెనక్కి తిప్పి.. ట్రాఫిక్‌ కు అడ్డంగా పెట్టేస్తాడు ధోని.

ట్రాఫిక్‌ పోలీస్‌ వచ్చి.. ఎందుకిలా పెట్టావని అడిగితే.. తన స్టైల్‌ లో సూపర్‌ ఓవర్‌ నడుస్తోందంటూ సమధానం ఇస్తాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌.. ఒకే తలైవా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఇక ఆఖరిలో 10 జట్లలో కీలక ప్లేయర్లను చూపించారు. అయితే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా మహేంద్రసింగ్‌ ధోనీ స్థానంలో ఆల్‌ రౌండర్‌ జడేజా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news