తెలుగు జట్టుగా ఐపీఎల్ లోకి అడుగు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన విధంగా ఫలితాలను రాబట్టలేక చతికిలపడుతోంది. గత సీజన్ లో విలియమ్సన్ కెప్టెన్ గా దారుణంగా విఫలమయ్యాడని ఈసారి సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రామ్ ను కెప్టెన్ గా తీసుకుంది. అయినప్పటికీ మార్ క్రామ్ ప్లేయర్ గా పెద్దగా ప్రభావం చూపకపోగా, కెప్టెన్ గా సైతం విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు చూసుకుంటే SRH ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండింటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. SRH ఆడుతున్న తీరు చూస్తే గల్లీ క్రికెట్ కూడా అలా ఉండదు, అంతలా పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్ , రాహుల్ త్రిపాఠి లు అంది వచ్చిన అవకాశాలను సరిగా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు.
వీరిని ఒక రెండు మ్యాచ్ లకు పక్కన పెట్టి సమర్థ్ వ్యాస్ , అన్మోల్ ప్రీత్ సింగ్ , ఉపేంద్ర యాదవ్ లాంటి కుర్రాళ్లను తీసుకుంటే ఉపయోగం ఉంటుందన్నది ప్రముఖ క్రికెటర్ల అభిప్రాయం.