ఐపీఎల్ 2023: పవర్ ప్లే లోనే చేతులెత్తేసిన “జాసన్ రాయ్ & గుర్బాజ్” లు … !

-

సంజు శాంసన్ ఎంతో నమ్మకంతో మొదట టాస్ గెలిచినా బాటింగ్ తీసుకోకుండా ఫిల్డింగ్ వైపే మొగ్గు చూపాడు. కెప్టెన్ తన బౌలర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. పవర్ ప్లే లోనే బౌల్ట్ ప్రమాదకర జాసన్ రాయ్ మరియు రహమానుల్లా గుర్బాజ్ లను అవుట్ చేసి రాజస్థాన్ కు అద్భుతమైన స్టార్టింగ్ ను ఇచ్చాడు. ఇక కీలకమైన ఈ మ్యాచ్ లో కోల్కతా ఆటగాళ్లు పరిస్థితికి తగినట్లు ఆడడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు భారీ షాట్ లు ఆడడం చాలా కష్టం… ముఖ్యంగా మిడిల్ కావు ఆ షాట్ లు.. కానీ ఇద్దరూ కూడా బౌల్ట్ బౌలింగ్ లో ఫీల్డర్ లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు.

దీనితో ఈడెన్ గార్డెన్స్ లో తప్పక భారీ స్కోర్ చేయాల్సి ఉండగా ఇద్దరు కీలక బ్యాట్స్మన్ లు అవుట్ అవ్వడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. మరి క్రీజులో ఉన్న నితీష్ రానా మరియు వెంకటేష్ అయ్యర్ లు జట్టును భారీ స్కోర్ వైపుకు తీసుకువెళ్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news