పాల: పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అది సరైన పద్ధతిలో, సరైన సమయంలో తాగకపోతే అంతే డేంజర్.. రోజూ పాలను తాగడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే పాలను మరిగించడంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. మీరు కూడా పాలను పదే పదే మరిగిస్టుంటారు కదా..! ఇది నిజానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. పాలను మరిగించడంలో చేసే పొరపాట్ల వల్ల పాల ద్వారా మనకు పోషకాలు లభించవు. పాలను కొందరు చాలా సేపు మరిగిస్తారు. ఇక కొందరు పదే పదే మరిగించి ఉపయోగిస్తుంటారు. పాలను అవసరం కన్నా ఎక్కువ సేపు మరిగించినా లేదా పదే పదే మరిగించినా అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ఆ తరువాత ఆ పాలను తాగినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
పాలను ఈ విధంగా మరిగించాలి
పాలను స్టవ్ మీద పెట్టాక అవి మరిగేటప్పుడు కంటిన్యూగా స్పూన్ లేదా గంటెతో పాలను తిప్పుతుండాలి.
పాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆలస్యం చేయరాదు.
ఒకసారి పాలను మరిగించాక మళ్లీ మళ్లీ మరిగించరాదు.
పాలను పదే పదే మరిగించే కొద్దీ అందులో ఉండే పోషకాలు నశిస్తాయి.
పాలను ఒక్కసారి మాత్రమే మరిగించాలి. తరువాత అవసరం అనుకుంటే కొద్దిగా వేడి చేసి తాగవచ్చు. కానీ మళ్లీ మరిగించకూడదు.
పాలను తాగేటప్పుడు పాటించాల్సిన సూచనలు
ఆహారం తిన్న తరువాత పాలను తాగుదామనుకుంటే ఆహారాన్ని కొంత మాత్రమే తినాలి. సగం వరకు జీర్ణాశయాన్ని ఖాళీ ఉంచాలి. దీంతో పాలను తాగితే లెవల్ అవుతుంది. జీర్ణ సమస్యలు రావు.
వంకాయ, ఉల్లిపాయలను తిన్న తరువాత పాలను తాగకండి. కొద్దిగా విరామం ఇచ్చి పాలను తాగండి. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి.
మాంసాహారం లేదా చేపలు తిన్నాక పాలను తాగకూడదు. లేదంటే చర్మంపై ప్యాచ్‌లు ఏర్పడుతాయి.
ఈ విధంగా పాలను మరిగించేప్పుడు, జాగ్రత్తలు తీసుకుని తాగితే.. మనకు అన్ని ప్రయోజనాలు అందుతాయి. లేదంటే జీర్ణసమస్యలు ప్రధానంగా వస్తాయి.. పాలను తాగక కూడా నోరు పుక్కిలించి వేయాలి.. లేదంటే పాలల్లో ఉండే తెల్లదనం దంతాలకు అంటుకుంటుంది. దీనివల్ల దంత సమస్యలు వస్తాయి.