ఐపిఎల్ 2023: ముంబై ఘనవిజయం… సూర్య… ఇషాన్ కిషన్ అదరహో ! ఈ రోజు ముంబై

-

ఈ రోజు ముంబై మరియు పంజాబ్ ల మ్యాచ్ లో ముంబై ఆరు వికెట్ల తేడాతో మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై కు పంజాబ్ పటిష్ఠమైన టార్గెట్ ను సెట్ చేసింది. కానీ మొహాలీ లాంటి బ్యాటింగ్ ట్రాక్ పై ఈ స్కోర్ ను కాపాడుకోవడం కష్టమే… అయినా పంజాబ్ కు ఉన్న బౌలింగ్ వనరులకు డిపెండ్ చేయవచ్చు అనుకున్నారు.. కానీ రోహిత్ శర్మ ఒకరు మినహా అందరూ బ్యాట్ తో రాణించారు.

ఆరంభంలో ఇషాన్ ఆచితూచి ఆడినా కుదురుకున్నాక ట్రేడ్ మార్క్ షాట్ లు ఆడాడు… భారీ స్కోరు చేదనలో పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత… క్రేజు లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ గ్రౌండ్ కు నాలుగు వైపులా చూడచక్కని షాట్ లతో అలరించాడు. సూర్య మరియు ఇషాన్ కిషన్ లు వరుస ఓవర్ లలో ఔట్ అయినా టిం డేవిడ్ మరియు తిలక్ లు మరో ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించారు. దీనితో ముంబై ఆడిన 9 మ్యాచ్ లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news