ప్లే ఆఫ్ ఫైట్: ముంబై ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే… ఆలా జరగాల్సిందే !

-

జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఇప్పుడు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు చాలా కష్టంగా మారాయి. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. పైగా నెట్ రన్ రేట్ నెగటివ్ లో ఉండడం ప్రతికూలంగా మారనుంది. దీనితో ముంబై తనకు మిగిలిన ఆఖరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ తేడాతో గెలిస్తేనే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు, ఒకవేళ సాధారణంగా గెలిచినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే తర్వాత ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సెస్ ఉన్న జట్లలో బెంగుళూరు మరియు పంజాబ్ లు తమకు మిగిలి ఉన్న చివరి రెండు మ్యాచ్ లు గెలిస్తే వారికి 16 పాయింట్లు అవుతాయి.

అందుకే మిగిలిన జట్లతో పోల్చుకోకుండా ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై భారీ తేడాతో గెలవాలి… మొదట ఫీల్డింగ్ తీసుకుని ఛేజింగ్ లో ఎంత టార్గెట్ ఇచ్చినా 10 ఓవర్ లకే కొట్టేస్తే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా.

Read more RELATED
Recommended to you

Latest news