ఈ రోజు ఐపిఎల్ షెడ్యూల్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డుప్లిసిస్ సేన నిర్ణీత ఓవర్ లలో 9 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి నుండి పిచ్ లో వేగం లేకపోవడం తో స్పిన్నర్లు చెలరేగి పోయారు. పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది, మొదటి పవర్ ప్లే లో వికెట్ లేకుండా 42 పరుగులు చేసిన బెంగళూర్.. ఆ తర్వాత 14 ఓవర్ లకు కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది అంటే ఇన్నింగ్స్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కోర్ లో కోహ్లీ 31 మరియు డుప్లిసిస్ 44 పరుగులు చేశారు. లక్నో బౌలర్ల లలో నవీన్ 3, బిష్ణోయ 2 మరియు మిశ్రా 2 వికెట్లు అందుకున్నారు. అనంతరం 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో మరో ఒక బంతి మిగిలి వుండగానే 108 పరుగులకు ఆల్ ఔట్ అయి 18 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.
బెంగళూర్ బౌలింగ్ లో హజిల్వుడ్ 2 మరియు కర్న్ శర్మ 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ లో ఒక్క గౌతం మాత్రమే 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు.. గాయపడిన రాహుల్ బ్యాటింగ్ కు వచ్చినా చాలా ఇబ్బంది పడ్డాడు.