గత రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ శుబ్ మాన్ గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు మరియు 8 సిక్సులు సహాయంతో పరుగులు సాధించి ఐపీఎల్ కెరీర్ లో రెండవ సెంచరీ సాధించి అదరహో అనిపించాడు. ఆరంభం నుండి చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన శుబ్ మాన్ గిల్ కుదురుకున్నాక బెంగుళూరు బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ సీజన్ లో శుబ్ మాన్ గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, ఏకముగా లీగ్ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలో 56 .67 సగటుతో 680 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.
ఇక మొదటి స్థానంలో బెంగుళూరు కెప్టెన్ డుప్లిసిస్ 730 పరుగులతో ఉన్నాడు. ఇదే జోరును కనుక గిల్ చూపిస్తే మరోసారి గుజరాత్ టైటాన్స్ కప్ ను అందుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.