“జూమ్” మీటింగ్స్ తో ఇక ఇబ్బందే బాస్ !

-

గత మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని కరోనా అనే మహమ్మారి గడగడలాడించిన విషయం విదితమే. దీని వలన ఇప్పటికే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నాయి. అయితే అధికారికంగా ఉద్యోగులతో వారానికి ఒకసారి మీటింగ్ లు నిర్వహించుకుని వర్క్ ఏ విధంగా జరుగుతోంది ? స్టేటస్ ఏమిటి ? అన్న విషయాల గురించిన ఒక రిపోర్ట్ కోసం ఆన్లైన్ యాప్ ల ద్వారా వీడియో మీటింగ్ లు పెట్టుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా జూమ్ మీటింగ్ అన్నది చాలా పాపులర్ అయింది. కానీ ఈ జూమ్ మీటింగ్ లు నివ్రహించడం వలన మనుషులకు చాలా ఇబ్బంది అని యేల్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక సర్వే లో తేలింది. ఎందుకంటే ఈ మీటింగ్ లో సైలెంట్ గా ఉండే వాతావరణం, నెట్ కనెక్షన్ లో ఉండే ఇబ్బందులు, మైక్రోఫోన్ మ్యూట్ వంటి చర్యల వలన మెదడుపై తీవ్ర ఒత్తిడి కలుగుతుందని ఈ సర్వే తెలిపింది, ముఖ్యంగా మెదడులోని న్యూరల్ సిగ్నలింగ్ బలం భారీగా తగ్గిపోతుందని తెలిపారు.

అందుకే జూమ్ మీటింగ్ ల కన్నా కూడా ప్రత్యక్షముగా మాట్లాడుకోవడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా తయారు అవుతుందని ఈ అధ్యయనం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news