ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ సిక్సులు, ఫోర్ల లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరించారు.దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 20 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఆటగాడు ,సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులతో విధ్వంసం సృష్టించారు. అందులో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా , ఆ తర్వాత కొద్ది సేపటికి మరో ఆటగాడు ఈ రికార్డును బ్రేక్ చేశారు.అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో 50 రన్స్తో చెలరేగారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 2 ఫోర్లున్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఇక వీరిద్దరూ అవుట్ అయినప్పటికీ కూడా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరవిహారం చేశారు. హెన్రిక్ క్లాసెన్ కేవలం 34 బంతుల్లోనే 7 సిక్సర్లు ,4 ఫోర్ లతో 80 పరుగులు చేశారు. మరోవైపు మార్కారం 28 బంతిలో 42 పరుగులు చేశాడు.