IPL 2024 : చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల లతో ముంబై బౌలర్లపై సన్ రైజర్స్ ఆటగాళ్లు విరుచుకుపడుతున్నారు.

బౌలర్ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.దీంతో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తొలి 10 ఓవర్లలోనే 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో 148 పరుగులు బాదిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 131/3 (2021), పంజాబ్ కింగ్స్ జట్టు 131/3 (2014), డెక్కన్ ఛార్జర్స్ 130/0 (2008), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 129/0 (2016), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 128/0 (2013), లక్నో 128/2 (2023), చెన్నై సూపర్ కింగ్స్ 128/2 (2015) ఉన్నాయి.

 

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.క్రీజ్లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఐడెన్ మర్కారాం, క్లాసెన్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news