ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరం…!

-

ఐపీఎల్ 2020లో మరో ఇంట్రెస్టింగ్‌ పోరు జరగనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరుతో తలపడనుంది. పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్‌లో ఉన్న పంజాబ్‌.. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ పంజాబ్ గెలవాల్సిందే.మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంటోంది.

వరుస పరాజయాలకు పుల్‌స్టాప్‌ పెడుతూ.. విక్టరీల మీద విక్టరీలు కొడుతూ సూపర్ ఫామ్‌లో ఉంది కోహ్లీసేన. ఇంతవరకు టైటిల్‌ కొట్టిన కోహ్లీసేన మంచి ఊపు మీద కన్పిస్తోంది. గత మ్యాచ్‌ల్లో చెన్నై, కోల్‌కతాని మట్టికరిపించి మళ్లీ లయ అందుకుంది బెంగళూరు టీమ్‌. కోహ్లీ, డివిలియర్స్‌, ఫించ్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్స్‌ ఆర్సీబీ సొంతం. కానీ వీరిలో ఇద్దరూ వైఫల్యమైనా మ్యాచ్‌లో రాణించే వారే కరువయ్యారు. కోహ్లీ గత మూడు మ్యాచ్‌ల నుంచి అదరగొడుతున్నాడు. లాస్ట్‌ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ విధ్వంసం ముందు కోల్‌కతా నిలవలేకపోయింది. కొత్త కుర్రాడు దేవదత్‌ పడిక్కల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ బౌలింగ్‌ మాత్రం చాలా బలహీనంగా కన్పిస్తోంది. అయితే క్రిస్‌ మోరిస్ రాకతో బౌలింగ్‌ స్ట్రాంగ్‌గా మారింది.

ఇక పంజాబ్‌ విజయాల కోసం ఎదురుచూస్తోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి.. పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది పంజాబ్‌. ఇక నుంచి పంజాబ్‌కు ప్రతి మ్యాచ్‌ కీలకమే. ఈ సీజన్లో ఇప్పటి వరకూ బరిలో దిగిన క్రిస్ గేల్.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌‌ల్లో గేల్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావించినా.. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆడలేకపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ఫిట్‌గా ఉన్నానని గేల్ ప్రకటించాడు. గేల్ జట్టులోకి వస్తే.. మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో ఆడాల్సి రావడంతోపాటు.. మ్యాక్స్‌వెల్‌ను ఫైనల్‌ జట్టు నుంచి తప్పించినట్లే. బౌలింగ్ విషయంలో పంజాబ్‌ ఇబ్బంది పడుతోంది. షమీ, బిష్ణోయ్ రాణిస్తున్నా.. స్లాగ్ ఓవర్లలో సరిగా బౌలింగ్ చేయలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news