ఐపీఎల్‌లో మరో కీ ఫైట్‌..ఆ రెండు జట్లకు కీలక మ్యాచ్…!

-

ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో జట్ల స్థానాలు ఒక్క మ్యాచ్‌తోనే తలకిందులు అవుతున్నాయి. ఏ మ్యాచ్‌ ఓడినా పాయింట్స్‌ టేబుల్‌లోకి కిందకు రావడం ఖాయం. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్‌ కీలకమే. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఢీ కొనబోతోంది.

అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ పోరు కీలకం. మరోవైపు పంజాబ్‌పై గ్రాండ్‌ విక్టరీతో ధోనీసేన ఫామ్‌లోకి వచ్చింది. మరి ధోనీ ముందు దినేష్ కార్తీక్ నిలిచేనా..? టాప్​ క్లాస్​ప్లేయర్లను సరిగ్గా యూజ్​ చేసుకోలేకపోతున్నాడు కార్తీక్.

కోల్‌కతాలో శుభమన్‌గిల్‌, ఇయాన్‌ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, సునీల్‌ నరైన్‌ లాంటి టాప్‌ క్లాస్‌ ప్లేయర్స్‌ ఉన్నారు.అయినప్పటికీ కేకేఆర్ జట్టు అంతగా రాణించలేకపోతోంది. బౌలింగ్ విభాగంలోనూ మంచి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. దినేష్ కార్తీక్ వారందరినీ జట్టు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం లేదు. ప్యాట్‌ కమిన్స్‌, శివమ్‌ మావీ, కమలేష్‌ నాగర్‌కోటి వంటి సూపర్‌ ఫాస్ట్‌ బౌలర్లు కోల్‌కతా సొంతం. అయినా వీరు సరియైన సమయంలో రాణించడం లేదు. ఇదే ఇప్పుడు కోల్‌కతాకు పెద్ద సమస్యగా మారింది. స్పిన్‌ బౌలింగ్‌లో కూడా కోల్‌కతా స్ట్రాంగ్‌గా కన్పిస్తోంది. కానీ మ్యాచ్‌లో మాత్రం స్పిన్నర్లు సత్తా చాటలేకపోతున్నారు.

మరోవైపు హ్యాట్రిక్​ ఓటముల తర్వాత చెన్నై గాడిలో పడింది. వాట్సన్‌‌ ఫామ్‌‌లోకి రావడం అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. డుప్లెసిస్​ మంచి టచ్​లో ఉండగా, రాయుడు కూడా కుదురుకుంటే సీఎస్‌‌కేకు తిరుగులేదు. బ్రావో, జడేజా, కరన్ చెలరేగితే నైట్‌‌రైడర్స్​కు కష్టాలు తప్పవు. ఫినిషర్‌‌గా ధోనీ తన మార్క్‌‌ చూపితే..సీఎస్​కేకు తిరుగుండదు. బౌలింగ్‌‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. చెన్నై జట్టు విషయానికొస్తే.. కెప్టెన్ ఎంఎస్ ధోనీయే ఆ జట్టుకు కొండంత బలం. మూడుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టు. కోల్‌కతాపై ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. చెన్నై అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా బలంగానే ఉంది. అయితే, ధోనీ ముందు దినేష్ కార్తీక్ నిలబడతాడా? అనేది సందేహంగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news