గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి 104 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గతంలో గెలిచిన సీట్లు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు గెలవలేవు అని ఆయన తెలియజేశారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తెలియజేశారు.
ఇక ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని సినీ పరిశ్రమ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తెలియచేస్తుందని, ఆ పై చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ విషయానికి వస్తే థియేటర్ల యాజమాన్యంలో కూడా కొంత మంది ప్రస్తుతం థియేటర్ల తెరిస్తే బాగుంటుందని.. లేకపోతే మరి కొంతకాలం ఆగినాక ప్రారంభిస్తే మంచిది అన్న ఆలోచనలో ఉన్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు.