రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర కొండెక్కి కూర్చుంది. యుద్ధం సాకుగా చూపించి అరబ్ దేశాలు ఆయిల్ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.
అరబ్ దేశాల్లో ముఖ్యమైన సౌదీఅరేబియా ఆయిల్ రేట్లు పెంచగా తాజాగా దాని వైరి దేశమైనా ఇరాన్ సైతం గణనీయంగా ఆయిల్ పెంచింది. మార్చిలో బ్యారల్ ఆయిల్ మీద 2.05 డాలర్లు పెంచింది.
అయితే ఏప్రిల్ నెల నుంచి బ్యారల్ మీద 4.70 డాలర్లు పెంచింది. ఈ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి అని ఆ దేశ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ తెలియజేసింది.
రానున్న రోజుల్లో సౌదీఅరేబియా పెంచబోయే రేట్ల బట్టి తాము బ్యారల్ ఆయిల్ మీద పెంచబోతున్నాము అని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు .