IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు కేన్ మామ దూరం!

-

ఐపీఎల్ 2022 సమీపిస్తుంది. మ‌రో ప‌ది రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది. కాగ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న మొద‌టి మ్యాచ్ ను ఈ నెల 29వ తేదీన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌బోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ప‌ది రోజుల ముందే ఆరెంజ్ ఆర్మీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మ్యాచ్ కు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ఆడే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తుంది. కాగ కేన్ విలియ‌మ్సన్ కు గ‌త కొద్ది రోజ‌ల క్రితం మో చేతికి గాయం అయింది.

దీంతో చాలా రోజుల నుంచి అంత‌ర్జాతీయ క్రికెట్ కు కూడా దూరంగా ఉన్నాడు. ఆయ‌న చివ‌రి మ్యాచ్ ను గ‌త ఏడాది భార‌త్ తో ఆడాడు. త‌ర్వాత కేన్ మామ ఎలాంటి మ్యాచ్ ఆడ‌లేదు. కాగ గాయం స‌మ‌స్య‌తో పాటు ఫిట్ నెస్ స‌మ‌స్య‌ల‌ను కూడా కేన్ విలియ‌మ్స‌న్ ఎదుర్కొంటున్నార‌ని తెలుస్తుంది. అందుకే కేన్ మామ తొలి మ్యాచ్ కు అందుబాటు లో ఉండ‌టం క‌ష్టమే అని అంటున్నారు.

ఒక వేళ కేన్ విలియ‌మ్స‌న్ తొలి మ్యాచ్ కు దూరం అయితే.. కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ తీసుకునే అవ‌కాశం ఉంది. కాగ గ‌త ఏడాది సీజ‌న్ లో చివ‌రి మ్యాచ్ కు కూడా కేన్ మామ గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. అప్పుడు జ‌ట్టులో ఉన్న మ‌నీష్ పాండే కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news