ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్‌కు గురైందని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆ హెలికాప్టర్‌లో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది.ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో రైసీ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

-

ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్‌కు గురైందని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆ హెలికాప్టర్‌లో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది.ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో రైసీ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దులో ఉన్న జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెస్క్యూ వర్కర్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

ఇబ్రహీం రైసీ ఆదివారం ఉదయం అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి రెండు దేశాల మధ్య అరాస్ నదిపై నిర్మించిన ఆనకట్టను ప్రారంభించారు.అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇరాన్ స్థానిక మీడియా ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు రైసీ కాన్వాయ్‌లో 3 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 2 హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ కాగా ,హార్డ్ ల్యాండింగ్ సమయంలో ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను గుర్తించే పనిలో సహాయక బృందం చర్యలు చేపట్టింది

.

Read more RELATED
Recommended to you

Exit mobile version