ఈ నెల 22న ఇండియన్-2 నుంచి ఫస్ట్ సింగిల్

-

స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో ‘ఇండియన్ 2’ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సేనాపతి పునరాగమనానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ను షేర్ చేశారు.

కాగా, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version