కరోనా వైరస్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసినదే. అయితే ఒక్కొక్కటి మళ్ళీ క్రమంగా స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఈ మధ్యనే ఐఆర్సీటీసీ అందించే రెడీ టూ ఈట్ లేదా ఈ-కేటరింగ్ సేవలను కూడా స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈ-కేటరింగ్ కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవల పునరుద్దరణకు అనుమతించలేమని పేర్కొంది. అంతే కాక, మొబైల్ క్యాటరింగ్ ప్రస్తుత ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని రైల్వే శాఖ అంది.
మొబైల్ క్యాటరింగ్ ప్రస్తుత ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఇండియన్ రైల్వే తన క్యాటరింగ్, టికెటింగ్ విభాగానికి ఆదేశించింది. అయితే ఇప్పుడు ప్రత్యేక రైళ్లలో కేవలం ఈ-క్యాటరింగ్ లేదా రెడీ- టు -ఈట్ సేవలు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ఆహారం తో కరోనా సంక్రమణ అవకాశం ఉన్న దృష్ట్యా, ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచి ఈ నిర్ణయం తీసుకున్నాం అని రైల్వే అధికారి అన్నారు.
షరతుల ప్రకారం వండిన ఆహారాన్ని ప్యాకెట్లలో అందించే మొబైల్ క్యాటరింగ్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని ఐఆర్సీటిసి నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా మొబైల్ క్యాటరింగ్ సేవలు అందించనందుకు దీన్ని కాంట్రాక్టర్ డిఫాల్ట్‌గా పరిగణించ వద్దని, జరిమానా విధించ వద్దని, వారి సెక్యూరిటీ డిపాజిట్ (ఎస్డి), అడ్వాన్స్ లైసెన్స్ ఫీజును కూడా తిరిగి ఇవ్వాలని ఐఆర్‌సిటిసిని రైల్వే శాఖ ఆదేశించింది.
అలానే లైసెన్స్ ఫీజును తగ్గించి స్ట్రాటిక్ యూనిట్లకు అనుమతిచ్చిన విధం గానే మొబైల్ క్యాటరింగ్ సర్వీసులను కూడా పెర్మిషన్ ఇవ్వాలని కోరుతూ 2021 జనవరి 4న లేఖ రాసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవలకు అనుమతించ లేమని జనవరి 27, ఫిబ్రవరి 8న విడుదల చేసిన లేఖ లో రైల్వే బోర్డ్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఇండియన్ రైల్వే మొబైల్ క్యాటరర్స్ అసోసియేషన్ మద్రాసు హైకోర్డు లో పిల్ దాఖలు చేసింది. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు రైల్వే బోర్డు నిర్ణయం మేరకు నడుచుకోవడాలని ఐఆర్ఎంసిఎ కి చెప్పింది.