వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందో లేదో చూడాలా..? ఇలా ఈజీ..!

-

రైలు టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కో సారి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. మీ టికెట్ కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉందా..? చెక్ చేసుకోవాలా..? అయితే ఇలా చెయ్యండి. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయో మీరు ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. టిక్కెట్ బుకింగ్ నుంచి రైలు అప్‌డేట్‌ల దాకా మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

రైల్వే సౌకర్యాలు చాలా వరకు ఆన్‌లైన్‌లో ఉంటున్నాయి. వినియోగదారుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ పరిమితిని ఒక నెల లో రెట్టింపు చేసింది. IRCTC IDతో మీ ఆధార్ ని లింక్ చేస్తే నెలలో 24 టిక్కెట్‌లను బుక్ చెయ్యచ్చు.

వెయిటింగ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం అంటే వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందని కాదు. మీ టిక్కెట్‌ను నిర్ధారించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. PNR నంబర్ ఉంటే ఈజీగా మీరు తెలుసుకోవచ్చు.

దీని కోసం ముందుగా IRCTC వెబ్‌సైట్‌ కి వెళ్లండి.
ఆ తరవాత మీ ID, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు ఓ పేజీ ఓపెన్ అవుతుంది. PNR నంబర్‌ను నమోదు చేసి స్టేటస్ ని పొందొచ్చు.
ఇప్పుడు నిర్ధారణ అవకాశాలను పొందేందుకు మీరు ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఈజీగా మీరు మీ టిక్కెట్‌ను ధృవీకరించే అవకాశాన్ని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news