సిట్టింగులకు సీట్లు..జగన్ ధైర్యం చేయరా?

-

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి..అందులో కేవలం 19 స్థానాలు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు…మిగిలిన 156 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 151 మంది ఎమ్మెల్యేలు..టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీ సంఖ్య 156కు చేరుకుంది. సరే ఎమ్మెల్యేల సంఖ్య ఎలా ఉన్నా..వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీటు కాకుండా ఆ 155 మందికి సీట్లు ఇవ్వగలరా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి.

సిట్టింగులు అందరికీ మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపీకే భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. దాదాపు 50 పైనే ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు వైసీపీ సొంత సర్వేల్లోనే తేలింది. అలాంటప్పుడు అందరికీ సీట్లు ఇవ్వడం కష్టం. అయితే సొంత ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వలేని జగన్..టి‌డి‌పి-జనసేన ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

జగన్ విసిరిన సవాల్ కు ప్రతి సవాలుగా టి‌డి‌పి నేత ప్రత్తిపాటి పుల్లారావు..జగన్ కు దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. ఇక పొత్తులో పోటీ చేయాలో, వద్దో అది తమ ఇష్టమని అంటున్నారు. అయితే టి‌డి‌పి-జనసేనలు దాదాపు పొత్తులో పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి. ఆ రెండు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీకి కాస్త ఇబ్బంది అని చెప్పాలి.

అదే సమయంలో జగన్ కూడా..అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కూడా కష్టమనే చెప్పాలి. అందరికీ సీట్లు వస్తే వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పటినుంచే కొందరు సిట్టింగులని సైడ్ చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి జగన్ ఒక సవాల్ విసిరితే..ఆయనకు చాలా సవాళ్ళు ఎదురయ్యేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news